V1News Telangana

best news portal development company in india

శ్రావణమాసం సోమవారం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు…..

SHARE:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో కొండపై స్వయంభు గా వెలసి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వారి మొక్కులకు అనుగుణంగా పూజలు నిర్వహించి అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకట్రావ్ మాట్లాడుతూ 18 సంవత్సరాల తరువాత శ్రావణమాసంలో ఐదు సోమవారాలు రావడం విశేషంగా జరిగిందని తెలిపారు. అదేవిధంగా 71 సంవత్సరాల తర్వాత శ్రావణమాసం ప్రారంభం సోమవారం రోజు జరగడం గొప్ప విషయం అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి మైలారం గ్రామంలో కొండపై స్వయంభుగా వెలసి వందల సంవత్సరాల చరిత్ర కలిగి భక్తులకు కోరిన కోరికలు తీర్చే భోలా శంకరుడిగా ప్రసిద్ధిగాంచాడని అన్నారు. గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు దేవాలయానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించారని తెలిపారు. చుట్టూ పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం వెలిసిందని కొనియాడారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులే కాకుండా దూర ప్రాంతాల భక్తులు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో శ్రావణమాసంలో దైవదర్శనాలను మరియు అభిషేక కార్యక్రమాలను నిర్వహించి సుఖశాంతులతో, ఆధ్యాత్మికంగా సన్మార్గంలో జీవించాలని అన్నారు. రాజరాజేశ్వర స్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరూ పాడిపంటలు సమృద్ధిగా పండి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్లవార్ రాము, అయినాల లింగం, మంతపురి రామా గౌడ్, నార్లవార్ సంగమేశ్వర్, కస్తూరి రతన్, గుండావార్ భాస్కర్, గొడిసెల చంద్రశేఖర్ గౌడ్, గొల్ల రాజేష్, విట్టల్, మంగలి రతన్, నార్లవార్ పండరి, దారం వినయ్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india