V1News Telangana

best news portal development company in india

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ నిర్వహించిన వివిధ సంఘాల నాయకులు….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలు కామ్ శెట్ పల్లి, నెమ్లి, అంకోల్ క్యాంప్, దుర్కి తదితర గ్రామాలలో సోమవారం రోజు బిజెపి పార్టీ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై మరియు హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించి బందుకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గ్రామాలలో గల వ్యాపార సముదాయాలను, పాఠశాలలు, పెట్రోల్ బంకులు, వైన్స్ దుకాణాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు, బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను మరియు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారని అయోధ్యలో మహంతులు, ఇందు సంస్థలు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారని గుర్తు చేశారు. బిజెపి మాజీ నాయకుడు పండిట్ సునీల్ భరాలా బంగ్లాదేశ్ లోని హిందూ మైనారిటీలకు ప్రస్తుతం ముప్పు పొంచి ఉందని చేసిన వ్యాఖ్యలను మరియు దేవాలయాలు మరియు మఠాలకు భద్రత లేదని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరిస్తుందని ఇది ఇలాగే కొనసాగితే భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుందని అన్నారని తెలియజేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా మరియు దేశ నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్ లోని మైనారిటీ హిందువులు మరియు ఇతర సమూహాలపై జరిగిన దాడులను ఆరోపిస్తూ, హింసను నిరసిస్తూ ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి ప్రేక్షక పాత్ర వహించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రపంచ దేశాలలోని అన్ని వర్గాల ప్రజలు విద్యాపరంగా మరియు వ్యాపార పరంగా దేశంలో ఎటువంటి విభేదాలు తారతమ్యాలు లేకుండా హాయిగా జీవిస్తున్నారని అన్నారు. కానీ వివిధ దేశాలలో ముఖ్యంగా ముస్లిం ప్రాబల్య దేశాలలో నివసిస్తున్న హిందువుల పట్ల వారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి స్పందించి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను అదుపులోకి తీసుకొచ్చి వారిని కాపాడాలని కోరారు. బంద్ పట్ల ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి సహకరించారు. బంద్ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు జనపల సాయిలు, ఇల్లెందుల సాయా గౌడ్, అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి గౌడ్, పసుపు సాయిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india