V1News Telangana

best news portal development company in india

రానున్న మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది.

SHARE:

????️తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న మూడురోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెప్పింది.

నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగా, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది.. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో నిజామాబాద్‌, వనపర్తి, మెదక్‌, నల్గొండ, వరంగల్‌, సిద్దిపేట, మహబూబాబాద్‌, కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజెర్లలో 148 మిల్లీమీటర్లు, తల్లాడలో 120 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్‌ పేర్కొంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india