V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజు ఎంపీఓ సూర్యకాంత్ మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మండల పరిధిలో గల బొమ్మన్ దేవ్ పల్లి, సంగం, హాజీపూర్ మొదలగు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులు మరియు పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. బొమ్మందేవ్ పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీలు నిర్వహించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగిందని తెలిపారు. నసురుల్లాబాద్ మండల ఎంపీడీవో బదిలీపై వెళ్లిపోవడంతో ఇంచార్జ్ బాధ్యతలు తనను నిర్వహించవలసిందిగా సీఈవో ఆదేశించారని తెలియజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో మొత్తం 12 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎనిమిది మంది బదిలీపై వేరే చోటికి వెళ్లిపోగా వారి స్థానాలలో అన్ని గ్రామాలలో కార్యదర్శులు నియామకం జరిగినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తు, సమయపాలన పాటించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో ప్రజలకు మంచినీటి సరఫరా,పారిశుధ్యం మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మా దృష్టికి వచ్చిన అంశాలను సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తామని ఒకవేళ మా వల్ల పరిష్కారం కానీ యెడల ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలలో మట్టితో నిర్మించి శిధిలావస్థలో ఉన్న ఇళ్లను పంచాయతీ కార్యదర్శుల ద్వారా గుర్తించి తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను సత్వరమే పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందేలా చర్యలు చేపడతామని తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








