V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శనివారం రోజు మాజీ పిఎసిఎస్ చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు గ్రామ నాయకుల సమక్షంలో అందరి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించుకున్న వారికి చాలాకాలంగా బిల్లులు నిలిచిపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఈ విషయాన్ని మాజీ శాసనసభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో సమస్యను వివరించి దాదాపుగా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన బిల్లులను సుమారు 8 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకోవడం వలన ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఈరోజు బిల్లులు మంజూరు కావడం వలన కొంతవరకు ప్రజలకు ఉపశమనం కలిగినట్లు అవుతుందని అన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకున్న వారు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో అందరికీ తప్పకుండా డబుల్ బెడ్ రూమ్ బిల్లులు మంజూరు చేయించే దిశగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మరియు పెన్షన్ వంటి పథకాల ద్వారా ప్రజలకు రావలసిన ఆర్థిక సహాయం గురించి కూడా చర్చలు జరిపి వాటిని కూడా తొందరగా అమలయ్యే విధంగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, మాజీ ఎంపీటీసీ మహేందర్, నాయకులు బాల హరిశ్చంద్ర రెడ్డి, లింగం గౌడ్, జనపల సాయిలు, చంద్ర గౌడ్, బొట్టే రమేష్, దడిగి భూమయ్య, భాస్కర్, జగన్, అల్లం రాములు, దక్కలి మహేందర్, బండ్ల రాములు, షాబుద్దీన్, శాల సాయిలు, అఫ్జల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








