V1News Telangana

best news portal development company in india

డ్రైడే ఫ్రైడే” కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎన్ఎం అంజనాదేవి ఆధ్వర్యంలో “డ్రైడే ఫ్రైడే” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు…

ఈ క్రమంలో గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా రోజు ఇంట్లో వినియోగించుకొనే నీటిని ఎప్పటికప్పుడు నీటి తొట్టిలను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రంగా కడుక్కొని అనంతరం తొట్టిలలో నీటిని నింపుకొని వినియోగించుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలలో ఉపయోగకరంగా లేనటువంటి వస్తువులను చెత్తా,చెదారం మరియు పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం వలన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నీరు ఎక్కువ రోజులపాటు నిలువ ఉండడం వలన వాటిలో దోమ లార్వాలు అభివృద్ధి చెంది అధిక సంఖ్యలో దోమలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా నిర్మూలించడానికి ప్రజలందరూ పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ప్రజలు ఎవరికైనా జ్వరం, వాంతులు, విరోచనాలు, తలనొప్పులు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపించిన ఎడల ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వం చేసే ప్రయత్నంలో అందరం భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఆశా వర్కర్లు లావణ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india