V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వరంగల్ సభలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలి…..

SHARE:

-బిజెపి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు యాదవ్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హనుమాన్లు యాదవ్ మంగళవారం రోజు పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రూ .2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలేదన్నారు. రైతు భరోసా పేరిట భూమి ఉన్న రైతుతోపాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ 12 వేలు , ప్రకృతి వైపరీత్యాలు లేదా వివిధ కారణాలతో పంట నష్టపోయినట్లైతే నష్టపరిహారం అందే విధంగా పంటల భీమా, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు, భూమిలేని రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం వర్తింప చేస్తామన్నారు, పోడు భూముల రైతులకు మరియు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాల తో పాటు సహా అన్ని యజమాని హక్కులు కల్పిస్తామని.. అదేవిధంగా ధరణి పోర్టల్ ను రద్దుచేసి దాని స్థానంలో భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవిన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయకపోవడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో ఎటువంటి పురోగతి కనబడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను మరియు పరిపాలనను పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకమని ప్రగల్బాలు పలికి ఇప్పుడు మాత్రం అధికారం కొరకు ఇంతకు దిగజారుతున్నాడు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిత్తశుద్ధితో రైతులకు ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india