V1News Telangana

best news portal development company in india

తమ నాయకుడికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించినందుకు సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కాసుల బాలరాజ్ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజును నియమిస్తూ సోమవారం రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీర్కూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బోయిని శంకర్ ఆధ్వర్యంలో కామప్ప చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుతూ తమ నాయకుడి ని రాష్ట్ర స్థాయి పదవి వరించడం పట్ల సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, నాయకులు కాంత్ రెడ్డి, ఆవారి గంగారం, శశికాంత్, ఆరిఫ్, దొంతురాం కాశీరాం, గుండ్ల శ్రీనివాస్, పుల్లేని పీరయ్య, పల్లికొండ సాయిబాబా, రఫీ, గొండ్ల రాజు, తోట ప్రభాకర్, ఆగిరిరావు, దేశాయ్, దుంపల రాజు, కొరిమె రఘు, మన్నాన్, లాయక్, సత్యం, ప్రేమ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india