V1News Telangana

best news portal development company in india

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం రోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సేవలు ప్రజలు మరువలేనివని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, మైనారిటీలకు రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆప్యాయంగా పలకరింపు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పరిపాలన దక్షత ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి అంబలి బస్వరాజ్ పటేల్, అబ్దుల్ హైమద్, బ్రహ్మయ్య, నారాయణ, సాయిలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india