V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రోజు ఉత్తమ రైతుగా ఏనుగు పట్ల బశెట్టి ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకుని పని పట్ల నిబద్ధతతో వ్యవసాయాన్ని నిర్వహిస్తూ తోటి వ్యవసాయదారులకు వ్యవసాయంలో పండించే పంటల పట్ల అవగాహన కల్పిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను ఆయన సేవలను గుర్తించి ఉత్తమ రైతుగా సత్కరిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, రైతు సమన్వయ అధ్యక్షుడు ఆ వారి గంగారం, లయన్స్ క్లబ్ సభ్యులు కొత్తూరి సంతోష్ గుప్తా, సితాలే రమేష్, రైతులు గంద్యాటం విట్టల్, మేకల శ్రీనివాస్, ఇండ్ల రాజేందర్, బాబూలాల్, యాద రావు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








