-ప్రభుత్వ పాఠశాలలో అక్రమంగా ప్రవేశ రుసుములు వసూలు చేస్తున్న వైనం
-దర్యాప్తు జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
-విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల వద్ద నుండి ప్రవేశాల కొరకు రుసుము పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామానికి చెందిన విద్యార్థి తండ్రి సుందర్ ప్రశ్నించగా.. సదరు ఉపాధ్యాయురాలి భర్త అతనిపై దాడి చేసిన సంఘటన ఇటీవల వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో డబ్బులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించినందుకు అతనిపై దాడి చేయడం పట్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పాఠశాలలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థి తండ్రి పై దాడి చేసిన ఉపాధ్యాయురాలి భర్తపై మరియు అందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రోజు విద్యార్థి సంఘాల నాయకులు ఆర్డిఓ రమేష్ రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పుట్ట భాస్కర్, రవీందర్ గౌడ్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








