-నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావ్
V1 న్యూస్ బిచ్కుంద ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో ఆదివారం రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావ్ సిద్దేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణము మరియు సిసి రోడ్డు నిర్మాణాల శంకుస్థాపన (భూమి పూజ) నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయేమోనని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ కు ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








