-గ్రూపు రాజకీయ తగాదాలు సృష్టించేలా విమర్శలు చేస్తున్నారు
-బిఆర్ఎస్ పార్టీలో పదేళ్లపాటు పోచారం శ్రీనివాసరెడ్డి కీలక పదవులు అనుభవించి కెసిఆర్ కు వెన్నుపోటు పొడిచాడు
-మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాసరావ్ వ్యాఖ్యలు
V1 న్యూస్ వర్ని ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: వర్ని మండల ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావ్ అధ్యక్షతన అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు రాజకీయ తగాదాలు సృష్టించేలా విమర్శలకు దిగుతున్నారని వర్ని మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావ్ సమక్షంలో వారు వర్నిలో విలేకరులతో మాట్లాడారు.సిఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించిన,పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పార్టీ విలువలకు కట్టుబడి ఉండకుండా పోచారం పార్టీకి నష్టం కలిగించేలా పత్రిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.బీ ఆర్ఎస్ పార్టీలో పదేళ్ల పాటు పలు కీలక పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ సిఎం కేసిఆర్ కు వెన్నుపోటు పొడిచి, గతంలో నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు ను స్కూటర్లు, మోటార్ సైకిల్ ల దొంగగా చిత్రీకరించాడని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూకబ్జాలు చేస్తున్నాడని వారిని చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారని చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కి ఎన్ని భూకబ్జాలు చేద్దామని వచ్చాడని గుర్తు చేశారు . ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి అదే కాసుల బాల్ రాజ్ ను అక్కున చేర్చుకోవడం హాస్య స్పదమని విమర్శించారు. గతంలో సంస్కార్ భూముల విషయంలోనూ తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఈ విధానంతో ప్రజలు సైతం పోచారం వైఖరి పై నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పలు ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డి మూడో స్థానానికి దిగజారారని కాంగ్రెస్ పార్టీ మాత్రం డిపాజిట్ లో మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సవాల్ చేశారు.తన సహచరులకు భూ కబ్జాలు చేయించిన ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి ది కాదా అని ప్రశ్నించారు. ఏఐసిసీ ఆదేశాలతో బాన్సువాడ నియోజక వర్గ ఇంఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అన్ని ఎన్నికల్లో సముచిత గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు. కొంతమంది ఫోటోల రాజకీయం చేస్తున్నారని వారి బుద్ది మారి ప్రజల్లో ఉండాలని చెబుతూ ఇకపై పోచారం శ్రీనివాసరెడ్డి తప్పుడు ఆరోపణలకు పాల్పడితే తమ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకునేది లేదన్నారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కులకర్ణి సురేష్ , భజ్య నాయక్,రెడ్డి రాంబాబు,గంగప్పా,దశరథ్, ప్రసాద్,రమేష్ రాథోడ్, వకీల్ ఫారం రాంబాబు,కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








