V1News Telangana

best news portal development company in india

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు టిప్పర్లపై కేసు నమోదు….

SHARE:

-బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తాడ్కోలు గ్రామ శివారులో శనివారం రోజు ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వే బిల్లులు లేకుండా ఓవర్ లోడ్ తో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక రవాణా నిర్వహిస్తున్న లారీలు మరియు టిప్పర్లపై ఉక్కు పాదం మోపుతామని నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక టిప్పర్లను సీజ్ చేసి సంబంధిత మైనింగ్ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించామని ఆయన తెలిపారు. నిత్యం మంజీర పరివాహక ప్రాంతం నుండి ఇసుక బకాసురులు వందల సంఖ్యలో లారీలు మరియు టిప్పర్లలో ,ఓవర్ లోడ్ తో, ప్రభుత్వానికి వేబిల్ లు చెల్లించకుండా రాత్రింబవళ్లు అధిక వేగంతో ప్రయాణిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇంత జరుగుతున్న సంబంధితా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు వాపోతున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిన కొల్లగొడుతూ కోట్లు గడిస్తున్నారని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా గ్రామాలలో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని దుమ్ము దూళి అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india