V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానం లో శనివారం రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రాతఃకాల సమయంలో స్వామివారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసంతార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరరావు, నరసరాజు మరియు సమస్త భక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 07 వ తేదీ 2023 నుండి జూలై 06 వ తేదీ 2024 వరకు సుమారు 9 నెలల కాల వ్యవధి కి సంబంధించిన హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. హుండీ ఆదాయం రూ. 15 లక్షల 53 వేల 620 వచ్చిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు అన్న దాతలు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు దేవల వీర్రాజులు మరియు జయలక్ష్మి దంపతులు మరియు హుమ్నాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ రెడ్డి మరియు కనకమాలక్ష్మి దంపతులు అని తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల మరియు శాలువాతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








