V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని మిర్జాపూర్ గ్రామాన్ని శనివారం రోజు ఎంపీ ఓ రాము ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పారిశుద్ధ్య పనులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడి కేంద్రాన్ని మరియు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీ, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి కి తెలిపారు. నర్సరీలోని మొక్కలకు నీరు మరియు ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించాలని సూచించారు. గ్రామంలో గల పల్లె దవాఖానను సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని విధులలో సక్రమంగా హాజరుకావాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి చికిత్సలు అందించాలని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి.. మధ్యాహ్న భోజన పథకాన్ని మరియు విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి వసతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి. రవి మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








