V1News Telangana

best news portal development company in india

“ఏక్ పేడ్ మా కా నామ్” – “అమ్మ పేరిట ఒక మొక్క”కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బిజెపి పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు ఆదివారం రోజు భారతీయ జనతా పార్టీ నసురుల్లాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో” భారతీయ జన్ సంగ్”వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ (బిజెపి) జయంతి ఉత్సవాల సందర్భంగా “ఏక్ పేడ్ మా కా నామ్”- “అమ్మ పేరిట ఒక మొక్క”అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఇందులో భాగంగా శక్తి కేంద్రం ఇన్చార్జ్ లకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ గురుకుల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని తద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని.. స్వచ్ఛమైన ప్రాణవాయువు మరియు సమయానికి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పడడానికి వీలుగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ఆయన మండల వ్యాప్తంగా బిజెపి పార్టీ బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అందరికీ తమ తమ గ్రామాలలో కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ” మన్ కీ బాత్”కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, ఓ బి సి జిల్లా కార్యదర్శి వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, నాయకులు దుర్గం సంజీవ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ సాయిలు, బూత్ అధ్యక్షులు రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india