Post Views: 69
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మాజీ శాసనసభ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం రోజు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఆయనతో ఉన్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








