Post Views: 97
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో శనివారం రోజు పోలీసులు వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ కాలం చెల్లిపోయిననెంబర్ ప్లేట్ లేని వాహనాలు, కార్లు ,ఆటోలు ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించామని తెలిపారు. 35 నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను జప్తు చేశామన్నారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించి ఎవరి వాహనాలు వారికి అప్పగించినట్లు తెలియజేశారు. 18 సంవత్సరాలు వయస్సు నిండని పిల్లలు వాహనాలు నడిపినట్లయితే వారి తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








