పదవీ విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్‌కు వీడ్కోలు
త్రియంబకేశ్వర్ రావు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షణకు అందించిన సేవలు అత్యుత్తమం
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ శ్రీకాంత్,రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 29:-
రామగుండం నగర పాలక సంస్థ లో పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ కమిషనర్ ఆర్ . త్రియంబకేశ్వర్ రావు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షణకు అందించిన సేవలు అత్యుత్తమమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. , మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా రామగుండం నగరంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సంధర్భంగా శనివారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షణకై తెల్లవారుఝామునే విధులకు హాజరు కావడంతో పాటు ప్రజలు , ప్రజా ప్రతినిధుల ఫోన్ కాల్స్ కు వెo టనే స్పందించి సమస్య పరిష్కరించేవారని కొనియాడారు. రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ వివిధ మునిసిపాలిటీలలో ఇద్దరం కలిసి పని చేశామని రోజు వారీ నగర పాలక సంస్థ కార్యకలాపాలతో పాటు అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో తనకు ఎంతో తోడ్పాటునందించారని అన్నారు. ఈ సంధర్భంగా పలువురు కార్పొరేటర్లు , అధికారులు , సిబ్బంది మాట్లాడుతూ ఆయన తో అనుబంధం గుర్తు చేసుకుంటూ పదవీ విరమణ తదుపరి ఆయన భావిజీవితం బాగుండాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో రామగుండం నగర మేయర్ , కమిషనర్ . ప్రజా ప్రతినిధులు , అధికారులు , యావత్ సిబ్బంది తనకు ఎంతగానో సహకరించారని పదవీ విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్ ఆర్ . త్రియంబకేశ్వర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం త్రియంబకేశ్వర్ రావు దంపతులను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శంకర్ నాయక్ , బాల రాజ్ కుమార్ , కల్వచర్ల కృష్ణవేణి నాయకులు పాతపెల్లి ఎల్లయ్య , వెగోలపు శ్రీనివాస్ గౌడ్ , సలీం , పొన్నం లక్ష్మణ్ గౌడ్ , నడిపల్లి మురళీధర్ రావు, పెద్దపల్లి మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ అధికారులు రాజలింగు , చిన్నారావు , సుచరణ్ , రామన్ , మనోహర్ , , శ్రీనివాస రావు , శ్యామ్ , నగర పాలక సంస్థ , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM