V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో గల పల్లె దవాఖానాలో బుధవారం రోజు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం శిరీష ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్ మరియు వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి చికిత్సను అందించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి వివరించామని తెలిపారు. గర్భిణీ స్త్రీలలో హై రిస్క్ కేసులను గుర్తించి పల్లె దవాఖానకు వచ్చి చికిత్స చేయించుకోవాల్సిందిగా సూచించామని తెలియజేశారు. వర్షాకాలంలో ప్రజలకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గర్భిణీ స్త్రీల సంరక్షణ దృష్ట్యా బుధవారం రోజు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ ఎం.ఎల్. హెచ్.పి విధులకు హాజరు కాకపోవడం గమనార్హం.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు విజయ మరియు శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








