V1News Telangana

best news portal development company in india

మినీ గురుకులం(ఎస్టి బాలికల) హాస్టల్లో లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

SHARE:

????జూలై 2 వ తేదీ వరకు చివరి గడువు

???? స్థానికులకు ముందుగా ప్రాధాన్యతనిస్తాం

???? గురుకులంలో సీబీఎస్ఈ లో విద్యాబోధన ఉంటుంది

???? లాటరీ విధానం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాము

????రీజినల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ వెల్లడి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జిల్లాలోని మాచారెడ్డి మరియు నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో 30 కొత్త అడ్మిషన్లు, 2 వ తరగతి నుండి 5 వ తరగతిలో మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఎస్టీ విద్యార్థినులు వచ్చే నెల 2వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. ఆసక్తిగల ఎస్టీ బాలికలు సంబంధిత పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మాచారెడ్డి మరియు నాచుపల్లి స్థానిక గ్రామాల విద్యార్థినులకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒకవేళ సీట్లు మిగిలిన పక్షంలో ఇతర మండలాల వారికి అవకాశం ఇస్తామన్నారు. ఒకటవ తరగతిలో చేరే విద్యార్థులు ఐదు సంవత్సరాల వయసు పూర్తి చేసుకొని బాలికలు ఆధార్ కార్డ్, జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను తీసుకొని దరఖాస్తులు స్థానిక గురుకుల పాఠశాలలో సమర్పించాలన్నారు. విద్యార్థులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మినీ గురుకులాల్లో సీబీఎస్ఈలో విద్యాబోధన ఉంటుందని చెప్పారు. జూలై 5 న లాటరీ ద్వారా విద్యార్థినులు ఎంపిక జిల్లా అదనపు కలెక్టర్ సమక్షంలో ఉంటుందని అన్నారు. మాచారెడ్డి, నాచుపల్లి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india