V1 న్యూస్ నిజాంసాగర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ( కేజీబీవీ) బాలికల విద్యాలయంలో మంగళవారం రోజు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ విద్యార్థినులకు ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేకు విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కొరకు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు. చదువుతోపాటు ఆటపాటల్లో కూడా విద్యార్థులు రాణించాలని చెప్పారు. విద్యార్థులు కేవలం మార్కులు సాధించడమే లక్ష్యంగా విద్యాభ్యాసం చేయకూడదన్నారు. చదువుతోపాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యత, సామాజిక అవగాహన వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు ఉపాధ్యాయులను అనుకరిస్తుంటారు కావున ఉపాధ్యాయులు మంచి వ్యవహారిక శైలిని అలవర్చుకోవాలని, అదేవిధంగా విద్యార్థులను అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








