V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ఐకెపి కార్యాలయంలో మంగళవారం రోజు ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ” మహిళా శక్తి” సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఆయా రంగాలలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్దేశించామన్నారు. దీనిలో భాగంగా 2024 25 ఆర్థిక సంవత్సరానికి గాను నస్రుల్లాబాద్ మండలానికి రూ.25 కోట్లు లక్ష్యాన్ని సెర్ప్ ఆధ్వర్యంలో నిర్దేశించామన్నారు. వీటిలో భాగంగా నసురుల్లాబాద్ మరియు దుర్కి గ్రామాలకు రెండు మీసేవ సెంటర్లు, 147 పాడి గేదెలు యూనిట్లు, పెరటి కోళ్ల పెంపకం కు 64 యూనిట్లు, పౌల్ట్రీ మదర్ యూనిట్లు 15, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఒకటి , కస్టమర్ హియరింగ్ సెంటర్లను మంజూరు అయినట్లుగా ఆయన తెలిపారు. వీటిని మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ఆయన కోరారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








