V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజు ఐకెపి సీఏ వనజ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు.” మహిళా శక్తి” కార్యక్రమంలో భాగంగా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రోత్సహకాలు అందాలంటే.. డ్వాక్రా మహిళా సంఘంలో చేరాలని మహిళలకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో గల డ్వాక్రా మహిళా సంఘాలలో 60 సంవత్సరాలు పైబడిన మహిళలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలలో సభ్యత్వం లేని వారు ఉన్నట్లయితే వారిని నూతన మహిళా సంఘం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామాలలో నూతన మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మహిళలకు ప్రోత్సాహకాలుగా వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








