Post Views: 122
V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ గ్రామానికి చెందిన నాందేవ్ సోమవారం రోజు అటవీ ప్రాంతంలో మేకలను మేపుతుండగా అకస్మాత్తుగా తోడేళ్ల మంద మేకల పై దాడి చేశాయని తెలిపారు. మేకల మందపై తోడేళ్లు విచక్షణారహితంగా దాడి చేయడంతో మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో మేకల యజమాని నాందేవ్ సంఘటన స్థలంలో వాటిని చూస్తూ బోరున విలపించాడు. చనిపోయిన మేకల విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపాడు. మేకలను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నానని నా బ్రతుకుతెరువు వాటితోనే ఉందని ఆయన అన్నాడు. ప్రభుత్వం దయతలచి తనను ఆదుకోవాలని నాయకులను వేడుకున్నాడు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








