V1News Telangana

best news portal development company in india

అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్…..

SHARE:

V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తాడువాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో “అమ్మ ఆదర్శ పాఠశాల”లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో ని తరగతి గదులలో ఏర్పాటుచేసిన ట్యూబ్ లైట్లు మరియు ఫ్యాన్లు గమనించారు. సౌకర్యాల పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని సమకూర్చాలని తెలిపారు. విద్యార్థుల ఆహారం విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతి గదులలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, త్రాగునీటి వసతి, విద్యుత్, మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు మరమ్మత్తులు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎంపీడీవో, ఎంపీ ఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india