V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ….

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రోజు ప్రజా ప్రతినిధులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించి చాలామంది ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులకు క్రమశిక్షణ, ఉత్తమమైన విద్యాబోధన చేస్తారని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించడం వలన విద్యార్థులకు సామాజిక విలువలు ..అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సభ్యుడు సందీప్, కో ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, నాయకులు రాములు, రఫీ, కిరణ్, అధ్యాపకులు చంద్రశేఖర్, దేవి సింగ్, శ్యామ్, సావిత్రి, నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india