Post Views: 83
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావ్ ఆధ్వర్యంలో సోమవారం రోజు కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో గల ఎస్సై లు, సిఐలు, సిబ్బందితో కలిసి సాయంత్రం సమయంలో నిజాంసాగర్ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు మరియు నెంబర్ ప్లేట్లు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. 68 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ రామన్, పోలీస్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








