Post Views: 75
V1 న్యూస్ బిచ్కుంద ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బిచ్కుంద మండలంలోని గుండె నెమ్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సిద్ధిరాం పటేల్ ఇల్లు గత కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. విషయాన్ని తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం రోజు మాజీ ఎంపీటీసీ ఇంటికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని అతనికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








