V1News Telangana

best news portal development company in india

రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని అంకుల్ క్యాంప్ గ్రామంలో ఆదివారం రోజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేదిక శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వర్షాకాలం మొదలుకాగానే వరి నార్లు వేసుకొని వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు అన్నారు. ఇప్పటివరకు సరిగ్గా వర్షాలు కురువకపోవడంతో నాట్లు వేసుకోవడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల శ్రేయస్సు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తారు అన్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. నీటి విడుదలకు ఒప్పించారన్నారు. ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం రోజు బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంటల సాగుకు నీటిని విడుదల చేశారన్నారు. రైతుల సమస్యల పట్ల ప్రత్యేక చొరవతో సమస్య పరిష్కారానికి కృషి చేసి నీటిని విడుదల చేసినందుకు రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, నీతి కథలు శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లకు ఈ సందర్భంగా రైతుల తరఫునుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పాల్త్యా విటల్, నసురుల్లాబాద్ పి.ఎ.సి.ఎస్ చైర్మన్ గంగారం యాదవ్, మిర్జాపూర్ మాజీ సొసైటీ చైర్మన్ మారుతీ పటేల్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు, ప్రతాప్ సింగ్, పురం వెంకటరమణ, ఖలీల్, పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india