V1News Telangana

best news portal development company in india

పదవులు ముఖ్యం కాదు ప్రజా శ్రేయసు నా లక్ష్యం……

SHARE:

 

 

బాన్సువాడ ప్రజలు నా కుటుంబం వాళ్ళను కాపాడుకోవడం నా కర్తవ్యం…

బాన్స్వాడ ప్రజల అభివృద్ధి నా బాధ్యత….. పోచారం శ్రీనివాస్ రెడ్డి

గత 35 సంవత్సరాలుగా బాన్సువాడను తన కుటుంబం ల చూసుకుంటు రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గని అభివృద్ధిలో ముందంజలో తెచ్చిన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎదురులేని నాయకుడిగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన పేరు సంపాదించారు గత 35సంవత్సరాలనుండి నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన వైపు ఉన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన బాన్సువాడలో మాత్రం పోచారం హవా కొనసాగింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో వస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజా శ్రేయస్సు కోసం పార్టీ మారరాని కొందరు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. అధికారం లో ఉన్నప్పుడు 11వేల కు పైగా డబల్ బెడఁరూం లు రాష్ట్ర లో ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చినా ఘనత కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి దే. పార్టీ మారింది ప్రజా సేవ చేయడానికేనని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో బాన్స్వాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా వెళ్తుందని  కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలుపుతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కి రాజకీయాలో ఉన్న అనుభవం వలన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడిందని కొందరు రాజకీయ మేధావులు చెబుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india