Post Views: 65
-సివిల్ కోర్టు జడ్జి భార్గవి సూచనలు
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని తాడ్కోలు గ్రామంలో గల రైతు వేదికలో శనివారం రోజు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సివిల్ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, ఎంపీడీవో బషీరుద్దీన్, న్యాయవాదులు భూషణ్ రెడ్డి, ఖలీల్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, కోర్టు సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








