V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి తన ఫోన్ కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.5 లక్షలు లోన్ వచ్చిందని.. లోన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి రావడానికి కొంత డబ్బు ఫీజు రూపంలో చెల్లించాలని తెలిపాడు. దీనితో బాలకృష్ణ లోన్ ఆశతో గుర్తు తెలియని వ్యక్తి ని గుడ్డిగా నమ్మి రూ.30 వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు పంపాడని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. లోన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి బాలకృష్ణ పోలీసులను ఆశ్రయించాడని అన్నారు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింకులు కానీ డబ్బులు ఆశ చూపించినట్లైతే అటువంటి విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అనుమానం వచ్చినట్లయితే ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..