V1News Telangana

best news portal development company in india

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ….

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని సంగం మరియు అంకోల్, నస్రుల్లాబాద్ గ్రామాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు యోగా పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధి సునీల్ రాథోడ్ మాట్లాడుతూ సంగం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలతో యోగ ఆసనాలు వేయించాం అన్నారు. అదేవిధంగా అంకుల్ తాండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు యోగ ఆకారంలో కూర్చుని ఆసనాలు వేశారని తెలిపారు. ఈ క్రమంలో నసురుల్లాబాద్ గ్రామంలోని శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థులు యోగాసనాలు వేశారు అని తెలియజేశారు. ప్రతిరోజు అన్ని పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యోగ ఆసనాలు వేయిస్తామన్నారు. యోగ ఒక్కటే మన భారత దేశంలో పుట్టిందని కొనియాడారు. 2015 సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం పండగలా నిర్వహించుకుంటున్నారన్నారు.. ప్రస్తుత కాలంలో ప్రజలకు యోగ తప్పనిసరి అని సూచించారు. ఎందుకంటే ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు, బిపి, షుగర్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయని తెలిపారు. మానవ శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన చిన్నచిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాలను చాలిస్తున్నారన్నారు. ప్రజలు అధిక ఒత్తిడి లకు లోనవుతున్నారు కనుక ప్రతి ఒక్కరూ యోగాను వారి దినచర్యలో భాగంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగం గ్రామ అంగన్వాడి టీచర్ లలిత, అంకోల్ తండ ప్రధానోపాధ్యాయులు బాల్ రాజ్, శ్రీ వెంకట సాయి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india