V1News Telangana

best news portal development company in india

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే…..

SHARE:

-సీసీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

-నాణ్యత ప్రమాణాలు పాటించాలి

-ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావ్

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని దన్నూర్ గ్రామంలో శుక్రవారం రోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన నిర్వహించారు. సీసీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేయాలని సదరు గుత్తే దారుకు సూచించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india