V1News Telangana

best news portal development company in india

వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే….

SHARE:

-వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

-తోట లక్ష్మీ కాంతారావ్

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ శుక్రవారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని.. డాక్టర్లు, అధికారులు అందరూ సమన్వయంతో పని చేస్తూ వ్యాధులను అరికట్టాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యుల కొరత ఉన్న ఆస్పత్రులలో నియామకాలు చేపడతామని అన్నారు. అంబులెన్స్ సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో విద్య మరియు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india