V1News Telangana

best news portal development company in india

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి తట్టా చెమ్మస్ టోపీ బహూకరించిన కందుల సంధ్యారాణి 

SHARE:

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి తట్టా చెమ్మస్ టోపీ బహూకరించిన కందుల సంధ్యారాణి

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 21:-

మోడీ ప్రభుత్వం మూడవ సారి ప్రభుత్వ ఏర్పాటులో గనులకు నిలయమైన తెలంగాణ కి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా తెలంగాణ బిడ్డ అయిన కిషన్ రెడ్డిని నియమించిన అనంతరం మొదటి సారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన సందర్భంగా రామగుండం బీజేపీ ఇంఛార్జి కందుల సంధ్యారాణి గనులలో కార్మికులు ధరించే హెల్మెట్  టోపీ కార్మికులు వాడే తట్టా, చెమ్మాన్ ను కిషన్ రెడ్డి కి బహుకరించారు. ఈ విషయమై స్పందిస్తూ కార్మికులు ఎక్కువగా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి కార్మికులు గనుల్లో వాడే వస్తువులు నాకు బహుకరించడం నా పదవికి అలంకరణగా మారాయి అని సంతోషం వెలిబుచ్చారు. కార్మిక క్షేత్రాలలో గత ప్రభుత్వాల అలసత్వంతో మోసపూరిత మాటలతో కార్మికులను మభ్య పెట్టీ వాస్తవాలు తెలియకుండా చేశారు అని, ఇక నుండి అలాంటివి జరగుండా చూడాలి అని బీఎంస్ ని స్థానికంగా బలోపేతం అయ్యేలా చూస్తేనే మంచి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఆ వైపుకి అడుగులు వేద్దాం అని కందుల సంధ్యారాణి కి భరోసా ఇచ్చారు. గత పదేళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని పెండింగ్ లో ఉన్న 11 కొత్త గనులను తెరిపించడమే లక్ష్యమని ఇదే సందర్భంగా స్థానికంగా కూడా కార్మిక క్షేత్రాలను బలోపేతం చేద్దాం అని కిషన్ రెడ్డి అన్నారు అని కందుల సంధ్యారాణి తెలియజేశారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india