V1News Telangana

best news portal development company in india

ఆర్థిక భారమైన పనులను చేపట్టమని ఇబ్బంది పెట్టవద్దు

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక భారమైన పనులను చేయమని పంచాయతీ కార్యదర్శులను ఇబ్బంది పెట్టవద్దని పంచాయతీ కార్యదర్శులు బుధవారం రోజు ఎంపీడీవో లీలావతి మరియు ఎంపీఓ రాముకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా ఎటువంటి నిధులు పంచాయతీలకు రానందున ఆర్థికపరమైన పనులను చేయమని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పంచాయతీలలో ఆర్థిక భారంతో కూడిన పనులు మోటార్ రిపేరింగ్, ట్రాక్టర్ నిర్వహణ, సిబ్బంది వేతనాలు, పారిశుద్ధ్యం వంటి పనులు చేయడానికి తమ వద్ద ఎటువంటి నిధులు లేవని ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియపరచి త్వరితగతిన నిధులు విడుదల అయ్యేలా చూడాలని వారు కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india