Post Views: 80
కామారెడ్డి జిల్లా:బీర్కూర్ మండల కేంద్రంలో గల విత్తన కేంద్రాలకు సంబంధించిన దుకాణాలను మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు విత్తనాల బ్యాగుల సీలు సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించారు. విత్తనాల నాణ్యత, బిల్లులు, విత్తనాల స్టాక్ నిలువలను పరిశీలన చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఏ.డి. ఏ లక్ష్మీప్రసన్న, బిచ్కుంద ఏ.వో రాజలింగం, మద్నూర్ ఏవో రాజు, బీర్కూర్ ఏవో కమల తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








