V1News Telangana

best news portal development company in india

పాఠశాలలో పైపులైన్ల ధ్వంసం పై పోలీసులకు ఫిర్యాదు….

SHARE:

కామారెడ్డి జిల్లా: దోమకొండ మండల కేంద్రంలో గల బాలుర పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి త్రాగునీటికి సంబంధించిన మరియు మురుగునీరు ప్రవహించే పైపులను ధ్వంసం చేశారు. రాత్రిపూట ఆకతాయిలు పైపులైన్ లు ధ్వంసం చేశారని, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం రోజు దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవాలయం లాంటి విద్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నించిన నేపథ్యంలో ఇలాంటి సంస్కారహీనమైన పనులు చేసి ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేయడం తగిన పద్ధతి కాదని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india