కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో విద్యుత్ శాఖ ఏఈ రాంప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం రోజు “విద్యుత్ ప్రజావాణి”కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వినియోగదారుల నుండి పలు సమస్యల పట్ల ఫిర్యాదులు స్వీకరించారు. గృహలక్ష్మి పథకం వర్తించని లబ్ధిదారులు,విద్యుత్ కు సంబంధించిన సమస్యలు గానీ, అంతరాయం ఏర్పడినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఏ.ఈ ప్రజలకు తెలిపారు. ప్రతి సోమవారం రోజు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమస్యలు ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందించాలని తెలియజేశారు. సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లైతే వాటి పరిష్కారానికి నిరంతరాయం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








