V1News Telangana

best news portal development company in india

కానరాని స్లాటర్ హౌస్ ఉపయోగం…ప్రజాధనంతో నిర్మించిన స్లాటర్ హౌస్ కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితమా దాని ఉపయోగం ఎప్పుడు

SHARE:

కానరాని స్లాటర్ హౌస్ ఉపయోగం

ప్రజాధనంతో నిర్మించిన స్లాటర్ హౌస్ కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితమా దాని ఉపయోగం ఎప్పుడు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 17:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించిన స్లాటర్ హౌస్ నిరుపయోగంగా మిగిలింది. రామగుండం ప్రజల పన్నుతో లక్షలు ఖర్చుపెట్టి స్లాటర్ హౌస్ నిర్మించారు. కానీ అది కేవలం నిర్మాణానికి అంకితమయింది. రామగుండంలో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలికంగా సేవల్లోకి తీసుకువచ్చారు. అయితే అది కేవలం తాతకాలికంగానే నిలవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా ధనంతో రామగుండంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ అది కేవలం నిరుపయోగంగా మాత్రమే మిగిలింది. గతంలో స్లాటర్ హౌస్ లో మటన్ వ్యాపారస్తులు అక్కడే మేకలను కట్ చేసి స్టాంప్ వేసి అది దుకాణంకు తీసుకు వెళ్లేవారు. అయితే అది కొంతకాలం మాత్రమే పరిమితమైందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఇకముందు అయినా స్లాటర్ హౌస్ ఉపయోగం లోకి తీసుకు వస్తార లేక కేవలం నిర్మాణానికి పరిమితమ అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మటన్ షాప్ లో మేకలను కట్ చేస్తూ వ్యర్థాలను కాలువలో పడేస్తున్న మటన్ వ్యాపారస్తులు దాన్ని చోద్యం చూస్తున్న అధికారులు. ఇప్పటికైనా స్లాటర్ హౌస్ ఉపయోగంపై జిల్లా స్థాయిలో అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ స్పందించి దానిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india