V1News Telangana

best news portal development company in india

కొంతమంది యూట్యూబ్ విలేకరుల పేరుతో ఇసుక అక్రమ తరలింపు ప్రెస్ లో ఉన్నామంటూ యూట్యూబ్ చానల్స్ కొన్ని పత్రికల పేరుతో రెవెన్యూ అధికారుల వద్ద పర్మిషన్ల పత్రాలు తీసుకున్నామంటూ వాటి విక్రయాలు చేస్తూ భారీగా అక్రమ ఇసుక తరలింపు లో భాగస్వాములు అవుతున్నారు

SHARE:

వున్స, మందర్న నుంచి ప్రతిరోజు రాత్రిపూట ఇసుక అక్రమ తరలింపు
సిద్దాపూర్ నుంచి ప్రతిరోజు పగటిపూట రాత్రిపూట ఇసుక తరలింపు
కొంతమంది యూట్యూబ్ విలేకరుల పేరుతో ఇసుక అక్రమ తరలింపు
ప్రెస్ లో ఉన్నామంటూ యూట్యూబ్ చానల్స్ కొన్ని పత్రికల పేరుతో
రెవెన్యూ అధికారుల వద్ద
పర్మిషన్ల పత్రాలు తీసుకున్నామంటూ వాటి విక్రయాలు చేస్తూ భారీగా అక్రమ ఇసుక తరలింపు లో భాగస్వాములు అవుతున్నారు…


బోధన్
సాలురా
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం హున్స , మందర్న గ్రామాల నుంచి ప్రతి రోజు రాత్రి పూట జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది ఇసుక మాఫియా దారులు ఇసుక తరలింపు నే వృత్తిగా చేసుకొని, జోరుగా ఇసుక తరలిస్తున్నారని, పర్మిషన్లు లేకున్నప్పటికీ, పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక అక్రమంగా ప్రత్యేక వాహనాల్లో తరలిస్తూ అధికరేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సిద్దాపూర్ గ్రామ మంజీర సరిహద్దు ప్రాంతం నుంచి పగలు రాత్రి తేడా లేకుండా జోరుగా ఇసుక అక్రమంగా త్రవ్వకాలు చేసి వాటిని వివిధ పట్టణాలు వివిధ గ్రామాలకు తరలిస్తూ భారీ రేట్ల విక్రయిస్తూ వాల్తా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రాంతాల గ్రామాలనుంచి ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక ఆక్రమంగా తరలిస్తూ విక్రయాలు చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా వారు ఇచ్చే మాముల మత్తులో మునిగి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు శాఖ అధికారులు మైనింగ్ శాఖ అధికారులు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇసుక అక్రమ తరలింపు వైపు దృష్టి పెట్టడం లేదని మండిపడుతున్నారు.

కొంతమంది యూట్యూబ్ ఇతర పత్రికల పేరుతో తాము విలేకరులమంటూ తాము ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా వ్యవహరిస్తూ సంబంధిత శాఖ అధికారుల వద్దకు వెళ్లి పర్మిషన్ల పేరుతో ఇసుక మాఫియా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు . ఇసుక తరలిస్తున్నామని విలేకరుల పేరుతో రెవెన్యూ శాఖ అధికారుల వద్దకు పత్రాలు తీసుకొని వాటిని బడా ఇసుక మాఫిదారులకు విక్రయాలు చేస్తూ పరోక్షంగా ఇసుక మాఫియా చేయడంలో కారణభూతులవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india