Post Views: 91
కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని సంగం గ్రామంలో గుట్టుచప్పుడుగా పేకాట నిర్వహిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు శుక్రవారం రోజు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ మేరకు పదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. వారి వద్ద నుండి నగదు రూ.22 వేల ఆరు వందల రూపాయలు మరియు 8 మొబైల్ ఫోన్లు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని ఆమె తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








