Post Views: 110
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శుక్రవారం రోజు ఎం.పీ.ఓ రాము మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి మంచినీటి సరఫరా సర్వే నిర్వహించారు. గ్రామంలో ఎన్ని కుళాయిలు ఉన్నాయన్న విషయంపై సర్వే చేశారు. నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా సక్రమంగా జరగని ప్రదేశాలను గుర్తించి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. పైపు లీకేజీలు ఎక్కడైనా ఉన్నట్లయితే వెంటనే సిబ్బంది చేత మరమ్మత్తులు చేయించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








