V1News Telangana

best news portal development company in india

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్….

SHARE:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన గల డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను గురువారం రోజు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు సిబ్బందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉండడం వలన అధికంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలకు విష జ్వరాలు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య లోపం వలన ప్రజలు విష జ్వరాలు మరియు కీళ్ల నొప్పులు బారిన పడిన సంఘటనలు వెలుగు చూసి అన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు తడి చెత్త పొడి చెత్త ను వేరు చేస్తూ, పారిశుద్ధ్యం పాటిస్తూ బాన్సువాడ పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india