V1News Telangana

best news portal development company in india

నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం…..

SHARE:

నులి పురుగుల నిర్మూలన దినోత్సవం పై కలెక్టర్
కామారెడ్డి జిల్లా: చిన్నపిల్లల జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యే నట్టల నివారణకు జూన్ 20వ తేదీన గురువారం రోజు 14వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం రోజు కామారెడ్డి కలెక్టరేట్ లో ని సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూల దినోత్సవ కార్యక్రమం పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల జీర్ణాశయంలో నులిపురుగులు ఉత్పన్నమైనట్లయితే రక్తహీనత పోషకాహార లోపం వంటి లక్షణాలతో చాలా ఇబ్బంది పడతారని అన్నారు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలని సూచించారు. వారు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని, నులిపురుగుల నిర్మూలనకు తగిన ఔషధాలు వినియోగించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంపై ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి నులి పురుగుల నివారణకు కృషి చేసి, చిన్నపిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండేటట్లు పనిచేయాలని ఆదేశించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india