కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మరియు పిట్లం మండల కేంద్రాలలో గల ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం రోజు నిర్వహించిన “ఆచార్య జయశంకర్ బడిబాట”కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బడిబాడ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఏకరూప దుస్తులు మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పాఠశాలలు పునః ప్రారంభం అయిన రోజే విద్యార్థులకు పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల భవనాల పునర్నిర్మాణానికి మరియు మౌలిక సదుపాయాల కల్పన కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు క్రమశిక్షణ ,నైపుణ్యం కలిగి ఉంటారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజన సదుపాయం, ఉచిత దుస్తులు అన్ని సౌకర్యాలు లభిస్తాయని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్య సమాజంలో ప్రతి వ్యక్తికి గుర్తింపునిస్తుందని, మన జీవనస్థితిగతులను మారుస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన అన్నారు. తన తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎటువంటి ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో విద్యనభ్యసించాలని తెలిపారు. తాను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందరో మేధావులు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభసించి ఉన్నత స్థానాలకు ఎదిగామని విషయాన్ని వివరిస్తూ విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. ఈ మధ్య విలువడిన పదవ తరగతి ఫలితాలను గమనించినట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి వారికి, వారి తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








