V1News Telangana

best news portal development company in india

జాతీయ రహదారి నిర్మాణానికి రైతుల నుండి భూసేకరణ…..

SHARE:

కామారెడ్డి జిల్లా: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బుధవారం రోజు ఆర్డిఓ రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి, కామ్ షెట్ పల్లి, నసురుల్లాబాద్ గ్రామాలలో భూ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి వయా నర్సాపూర్ మెదక్ మీదుగా బాసర వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మూలమలుపులు ఉన్న ప్రాంతాలలో రోడ్డు నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టడానికి అవసరమయ్యే భూమిని రైతుల అనుమతితో సేకరించారు. నసురుల్లాబాద్ గ్రామ శివారులో 4 ఎకరాల 39 గుంటలు, కామ్ శేట్ పల్లి గ్రామ శివారులో 10 గుంటలు, దుర్కి గ్రామ శివారులో 5 ఎకరాల 4 గుంటలు వ్యవసాయ భూమిని సేకరించారు. భూ సేకరణ బాధితులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరం జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ హన్మండ్లు, జాతీయ రహదారుల ఏ ఈ శ్రీధర్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india